![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -374 లో.. జ్యోత్స్న ఇంట్లో దీప ఇల్లు క్లీన్ చేస్తుంది. ఏమైనా కావాలా అని జ్యోత్స్నని దీప అడుగుతుంది. ఏం వద్దు అంటూ జ్యోత్స్న దీప వంక అలాగే చూస్తుంది. అప్పుడే కార్తీక్ కూరగాయలు పట్టుకొని వచ్చి.. దీప ఈ రోజు ఈ వంటలు చేయు అని చెప్తుంటే.. అప్పుడే పారిజాతం వస్తుంది. నువ్వు ఇచ్చిన పనిష్మెంట్ వాళ్లకు ఎంటర్‌టైన్మెంట్ లాగా ఉందే అని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది.
అలా అయితే నువ్వు కూడా పని మనిషిలాగా మారమని కార్తీక్ వెటకారంగా మాట్లాడతాడు. దీప టీ పాయ్ క్లీన్ చేస్తుంది. కార్తీక్ బాబు ఈ దుమ్ము పోవట్లేదని దీప అనగానే.. ఎందుకు పోదు, ఇలా గట్టిగా తుడిస్తే ఏ దుమ్ము అయిన పోతుందని జ్యోత్స్న, పారిజాతానికి కౌంటర్ ఇచ్చేలా కార్తీక్ మాట్లాడతాడు. అప్పుడే శ్రీధర్ వస్తాడు. శ్రీధర్ వచ్చేసరికి కార్తీక్ టీ పాయ్ క్లీన్ చేస్తుంటాడు. నా కొడుకుని చివరికి పనిమనిషిని చేసారు కదా అంటూ కోపంగా అందరిని పిలుస్తాడు. సంతకం పేరుతో ఇలా చేస్తారా అని శివన్నారాయణతో శ్రీధర్ గొడవ పెట్టుకుంటాడు. నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళమని శివన్నారాయణ అంటాడు . నా కొడుకుని నాతో పాటు పంపించే వరకు ఇక్కడే ఉంటానని నట్టింట్లో కూర్చుంటాడు శ్రీధర్. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి వెళ్లకపోతే చెల్లి, పిన్నికి కాల్ చేస్తానని కార్తీక్ బెదిరిస్తాడు. దాంతో శ్రీధర్ వెళ్లిపోతానంటాడు.
ఇప్పుడు వెళ్లిపోతున్నానని మీరు అనుకోకండి మళ్ళీ వస్తానంటూ శ్రీధర్ చెప్పి వెళ్లిపోతాడు. దీప వంట చెయ్ అని తనని కిచెన్ లోకి తీసుకొని వెళ్తాడు కార్తీక్. బావేంటి ఇంత హ్యాపీగా ఉన్నాడు .. అసలు వీళ్ళు ఏదో ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చారని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు శ్రీధర్ ఇంటికి వెళ్లేసరికి స్వప్న, కాశీ భోజనం చేస్తుంటారు. శివన్నారాయణ ఇంటికి వెళ్లిన విషయం గురించి శ్రీధర్ ని కావేరి అడుగుతుంది. మీకెలా తెలుసు అని శ్రీధర్ అనగానే అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడని స్వప్న అంటుంది. నా కొడుకు ఆ ఇంట్లో అలా పని చెయ్యడానికి కారణం దీప అని శ్రీధర్ తిడతాడు. వాళ్ళు ఇంట్లో పని చెయ్యడం ఏంటని కాశీ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |